గోదావరి చెంతకు ప్రాణహిత | - | Sakshi
Sakshi News home page

గోదావరి చెంతకు ప్రాణహిత

Jul 5 2026 2:54 AM | Updated on Jul 5 2026 2:54 AM

కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా ప్రాణహితనదికి వరద తాకిడి పెరిగింది. మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరినదికి ప్రాణహిత వరద వచ్చి చేరుతుండడంతో జలకళ ఉట్టిపడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్నటికీ భారీవర్షాలు లేక గోదావరిలోకి వరద చేరలేదు. శనివారం కాళేశ్వరం వద్ద ప్రాణహితనది వరదతో 5.570 మీటర్ల ఎత్తులో నీటి మట్టం దిగువకు ప్రవహిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 62,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు అదేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు.

కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసిన ప్రాణహిత నది వరద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement