బల్క్‌ భూముల నివేదిక అందించాలి | - | Sakshi
Sakshi News home page

బల్క్‌ భూముల నివేదిక అందించాలి

Jul 5 2026 2:54 AM | Updated on Jul 5 2026 2:54 AM

భూపాలపల్లి: సర్వే పూర్తయిన బల్క్‌ భూముల నివేదికలు అందజేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో బల్క్‌ భూ ములు, సర్వే, సాదా బైనామా, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌పై భూపాలపల్లి నియోజకవర్గ రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన పూర్తి నివేదికలను అందజేయాలన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్‌’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఇంటింటికీ 98 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రక్రియ 9 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. డీఆర్‌ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు.

ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం

ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఈఆర్‌ఎస్‌ పథకం కింద మహిళా శిశు, వయోవృద్ధులు, ట్రాన్సజెండర్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈఆర్‌ఎస్‌ పథకంలో ఎంపికై న ట్రాన్స్‌జెండర్‌కు రూ.75 వేల విలువైన చెక్కును కలెక్టర్‌ అందజేశారు.

ప్రభుత్వ పథకాలకు

ప్రాధాన్యమిస్తున్నాం..

ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యమిస్తున్నామని, వైద్య, విద్య ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి సీఎస్‌ సంజయ్‌ జాజు అన్ని శాఖల కార్యదర్శులతో కలిసి వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ నుంచి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం..

వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరైన అధికారులపై కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో ప్రాధాన్య అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారని, సమావేశానికి సమగ్ర సమాచారంతో హాజరు కావాలని ముందస్తు సమాచారం ఇచ్చినా కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

కాన్ఫరెన్స్‌కు గైర్హాజరైన

అధికారులపై ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement