బకాయి బియ్యం తప్పనిసరిగా అప్పగించాలి | - | Sakshi
Sakshi News home page

బకాయి బియ్యం తప్పనిసరిగా అప్పగించాలి

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

భూపాలపల్లి అర్బన్‌: డిఫాల్ట్‌ మిల్లర్లు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్‌డీ ప్రభాకర్‌ శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 శాతం బియ్యం సరఫరా, 25 శాతం పెనాల్టీ వసూళ్లు, రబీ 2022–23 సీజన్‌లో వేలం వేసిన వడ్ల రికవరీ అంశాలపై స మీక్షించారు. బకాయిగా ఉన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని మిల్లర్లను ఆదేశించారు. ఆదేశాలను విస్మరించే మిల్లర్లపై చట్టపరమైన చర్యలతో పాటు రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఓఎస్‌డీ ప్రభాకర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ రాములు, డీఎస్‌ఓ కిరణ్‌కుమార్‌, ఏఎస్‌ఓ వేణుగోపాల్‌, డీటీలు రాజు, సురేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement