ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలను పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలను పెంచాలి

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలను అధికంగా పెంచాలని జిల్లా ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌హాల్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని అదనపు కలెక్టర్‌ విద్యాశాఖ, డీఆర్‌డీఏ, స్వయం సహాయక సంఘాల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పదో తరగతిలో 900, ఇంటర్మీడియట్‌లో 600 ప్రవేశాలు నమోదయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతో పాటు సెప్టెంబర్‌లో జరగనున్న జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ నిర్వహించే పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్‌, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్‌, వయోజన విద్య ఉపసంచాలకుడు వేణుగోపాల్‌, డీఆర్‌డీఓ బాలకృష్ణ, స్వయం సహాయక బృందాల అధికారి రాజేశ్వరి, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు, పరీక్షల సహాయకులు కుసుమ కృష్ణమోహన్‌, చల్ల కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

దోమల నివారణకు డ్రైడే పాటించాలి

దోమల నివారణకు డ్రై డే–ఫ్రై డే తప్పని సరిగా పాటించాలని అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం రాంనగర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాలనీవాసులకు ‘డ్రై డే–ఫ్రై డే’ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. డెంగీ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు, మురికిగుంటలు లేకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. దోమల నివారణ చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, 16వ వార్డు కౌన్సిలర్‌ జ్యోతుల మంజుల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement