నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ: విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలకేంద్రంలో ఎంజేపీ బాలుర పాఠశాలను శుక్రవారం కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి ఆయన తనిఖీ చేశారు. పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుండటంతో.. మరుగుదొడ్ల సమస్యలను ఎదుర్కొంటున్నారని అక్కడి పరిస్థితులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని భవన యజమానిని హెచ్చరించారు. వెంటనే మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు, స్నానాల కోసం నల్లాలు ఏర్పాటు, డ్రెయినేజీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కోసం మెస్‌ చార్జీలను పెంచినట్లు తెలి పారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ జీవన్‌, తహసీల్దార్‌ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ వేల్పుల ప్రభాకర్‌, సర్పంచ్‌ మౌనిక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement