మోడల్‌ స్కూల్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూల్‌ తనిఖీ

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

గణపురం: మండలకేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ను డిప్యూటీ డైరెక్టర్‌ (మధ్యాహ్న భోజన) జిల్లా పరిశీలనాధికారి వీఎస్‌ జనార్దన్‌రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డుల పరిశీలన, అడ్మీషన్ల ప్రగతి, మధ్యాహ్న భోజన పథకం అమలు పనితీరుతో పాటు తదితర విభాగాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఎంఓ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐటీఐ ప్రవేశాల గడువు పొడిగింపు

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు స్థానిక ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌, కన్వీనర్‌ జుమ్లానాయక్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాల పొందేందుకు అపరాద రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

12న ప్రవేశ పరీక్ష

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ఎంపికై న మూడు కేజీబీవీ కేంద్రాల్లో యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు 6వ తరగతి నుంచే జాతీయ స్థాయి పోటీ పరీక్షలు అయిన జేఈఈ, నీట్‌, సీఎల్‌ఏటీ తదితరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement