పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

మల్హర్‌(కాటారం): పెండింగ్‌ సమస్యలను వేగంగా పరిష్కరించి పారదర్శక సేవలు అందించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ సూచించారు. కాటారం సబ్‌ డివిజన్‌ పరిధిలోని బల్క్‌ ల్యాండ్‌ సమస్యలు, సాదాబైనామా, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్‌, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లేశ్వరి, సీడీపీఓ రాధిక, తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీఓ బాబు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం తనిఖీ..

అంకుశాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. కాటారం పీఏసీఎస్‌లో యూరియా బుకింగ్‌ వివరాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి యూరియా పంపిణీలో ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, నానో యూరియాపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement