
ఘనంగా రాఖీ వేడుకలు
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లాలో మహిళలు, యువతులు కనులపండువగా జరుపుకున్నారు. ప్రతీ కుటుంబంలో అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. విధుల్లో ఉన్న భూపాలపల్లి ఆర్టీసీ డిపో కండక్టర్ రాధాకృష్ణకు గోదావరిఖని నుంచి వచ్చి ఆర్టీసీ బస్సులోనే చెల్లి రాఖీ కట్టింది. పండుగ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. బస్సుల కోసం పరుగులు తీశారు. రాఖీ, ఇతర దుకాణాలు అమ్మకాలతో రద్దీగా మారాయి. – భూపాలపల్లి అర్బన్
– మరిన్ని ఫొటోలు 9లో..