పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

Apr 1 2025 11:33 AM | Updated on Apr 1 2025 3:33 PM

పేదల

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

భూపాలపల్లి రూరల్‌: రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్‌ కాలనీ చౌకధరల దుకాణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాశ్‌రెడ్డితో కలిసి సోమవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసినప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సరిచేసుకుంటూ హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. గతంలో రేషన్‌ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. గత పది సంవత్సరాలలో రేషన్‌ కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలకు ఉపయోగం కలుగుతుందన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన పనులు, నిధులు మంజూరు చేయించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, డీఎస్‌ఓ రాములు, ఆర్డీఓ రవి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీని వాస్‌, ముంజాల రవీందర్‌, టీపీసీసీ సభ్యుడు మ ధు, పిప్పాల రాజేందర్‌ పాల్గొన్నారు.

యువతకు ప్రోత్సాహం

రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం యువతను ప్రోత్సహిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పదేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో చాలామంది వయసు దాటిపోయి నిరుద్యోగులుగా మారారన్నారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాజీవ్‌ యువవికాసం పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఈ పథకానికి ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే 57వేలు ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్‌, టీపీసీసీ సభ్యుడు మధు, మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్‌, ముంజాల రవీందర్‌, నాయకులు పిప్పాల రాజేందర్‌, కురిమిల్ల శ్రీనివాస్‌, అప్పం కిషన్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

శ్రీధర్‌బాబు

ఐక్యతకు ప్రతీక రంజాన్‌

కాటారం: హిందూ, ముస్లింల ఐక్యతకు రంజాన్‌ పండగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని కాటారం మండలకేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ముస్లింలకు రంజాన్‌ చాలా పవిత్రమైన పండగ అన్నారు. నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి వారి భక్తిని చాటుకుంటారని పేర్కొన్నారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్‌, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్‌ అధ్యక్షుడు చిటూరి మహేశ్‌గౌడ్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు అజీజ్‌, ముస్లిం మతపెద్దలు, యువకులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం1
1/1

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement