ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదంటూ.. చనిపోతున్నానని ఫోన్‌చేసి..

- - Sakshi

సాక్షి, వరంగల్‌: ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. జీఆర్పీ సీఐ నరేష్‌ కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన కట్ట సుజాత తన భర్త మృతి చెందడంతో నగరంలో ఎండోమెంట్‌ శాఖలో ఉద్యోగం చేస్తూ కుమారుడు రాజ్‌కుమార్‌(23)తో కలిసి నగరంలోని గిర్మాజీపేటలో నివాసం ఉంటోంది. రాజ్‌కుమార్‌ ఒకేషనల్‌ చదువుతున్నాడు.

తరుచూ తల్లిని ఖర్చులకు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే చనిపోతానని బెదిరిస్తూ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. శుక్రవారం మళ్లీ తల్లిని ఖర్చులకు డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో అదేరోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి రైలు కింద పడి చనిపోతున్నానని ఫోన్‌లో చెప్పాడు. అనంతరం నగరంలోని సంతోషిమాతా ఆలయం ఎదుట ఉన్న రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్‌ఎస్‌ ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ కె భాస్కర్‌ కేసు నమోదు చేసుకుని మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి తల్లి సుజాతకు అప్పగించామని సీఐ నరేష్‌ శనివారం తెలిపారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Read latest Jayashankar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top