ఎన్‌ఐ యాక్ట్‌పై ప్రత్యేక లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐ యాక్ట్‌పై ప్రత్యేక లోక్‌అదాలత్‌

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

జనగామ రూరల్‌: ఎన్‌ఐ యాక్ట్‌పై ప్రత్యేక లోక్‌అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ జిల్లా కోర్టులో శనివారం నిర్వహించారు. మొత్తం నాలుగు బెంచ్‌ల ద్వారా కేసులను స్వీకరించి పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, కక్షదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్‌ఐ యాక్ట్‌ కేసులను పరిష్కరించుకోవాలన్నారు. మొదటి బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ, న్యాయవాది పుష్పా, రెండో బెంచ్‌కు జూనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ జి శశి, న్యాయవాది జ్యోత్స్న, మూడవ బెంచ్‌కు అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సందీప్‌, న్యాయవాది మేకల స్వప్న, నాలుగవ బెంచ్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శశి, న్యాయవాది అమ్మరాజు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కప్‌ ఇండోర్‌ గేమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి

జనగామ రూరల్‌: నేటినుంచి పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించే కలెక్టర్‌ కప్‌ ఇండోర్‌ గేమ్స్‌ పోటీలకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శనివారం ధర్మకంచ మినీ స్టేడియంలో డీవైఎస్‌ఓ నరసింహ రావు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్‌, జీసీడీఓ గౌసియా బేగం ఏర్పాట్లను పర్యవేక్షించారు. చెస్‌, క్యారమ్స్‌, బ్యాడ్మింటన్‌, యోగాసనాలు, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అధికారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భోజనం, క్రీడా సామగ్రి, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, విద్యుత్‌ సదుపాయాలు, తదితర ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టారు.

జాతీయ సమ్మిళిత నాటకోత్సవ జ్యూరీ

సభ్యుడిగా ఒగ్గు రవి

లింగాలఘణపురం: తెలంగాణ జానపద కళారంగానికి మరో జాతీయ గుర్తింపు లభించింది. జానపద కళ ఒగ్గుకథకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు తెస్తున్న ఒగ్గుకథ కళాకారుడు, పరిశోధకుడు, డాక్టర్‌ చౌదరిపల్లి రవిని జాతీయ సమ్మిళిత నాటకోత్సవం 2026 (ఎన్‌ఐటీఎఫ్‌) ప్రాంతీయ ఉత్సవాల జ్యూరీ సభ్యుడిగా ఎంపిక చేశారు. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగంలో నిర్వహిస్తున్న జాతీయ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించారు. ఇందులో దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శన కళారంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి వారి ప్రతిభను అంచనా వేసే ప్రక్రియలో ఆయన భాగస్వామ్యం కానున్నారు. ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ జాతీయ యువ పురస్కార గ్రహీతగా తెలంగాణ జానపద కళా వైభవాన్ని దేశ, విదేశాల్లో పరిచయం చేస్తున్నారు. కాగా జాతీయ స్థాయి ఉత్సవాల్లో జ్యూరీ సభ్యుడిగా ఎంపిక చేసన నిర్వాహుకులకు ఒగ్గు రవి కృతజ్ఞతలు తెలిపారు.

ఓపీఎస్‌ను

పునరుద్ధరించాలి

జనగామ: నూతన పెన్షన్‌ విధానం రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని జిల్లా టీఎన్‌జీఓ యూనియన్‌ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ ఖాజా షరీఫ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓ యూనియన్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్‌ విధానం వారి భవిష్యత్‌కు భరోసా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమలైన ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిసెంబర్‌ 12న ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు రాజ నర్సయ్య, కోశాధికారి హాఫిజ్‌, ఉపాధ్యక్షులు కొండ సంపత్‌కుమార్‌, రాంనర్సయ్య, జ్యోతి, అరుణ, నాగార్జున, శ్రీధర్‌బాబు, యాకుబ్‌పాషా, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement