కేడీసీ మైదానంలో జన చైతన్య సభ.. ఏర్పాట్లు పూర్తి
● ఏర్పాట్లు పరిశీలించిన బీఆర్‌ఎస్ నేతలు
● గులాబీ పార్టీలో చేరనున్న పలువురు నాయకులు
హన్మకొండ: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నేడు (ఆదివారం) హనుమకొండకు రానున్నారు. నగరంలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే జన చైతన్య సభలో పాల్గొంటారు. ఈ మేరకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓ విద్యాసంస్థల అధినేత తిరుపతిరెడ్డితోపాటు, ఆయా పార్టీల నుంచి పలువురు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సభ ఏర్పాట్లను శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌తో పాటు పార్టీ నాయకులు పరిశీలించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జన చైతన్య సభ జరుగుతుందని తెలిపారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈక్ర మంలో జన చైతన్య సభకు ప్రజలు వేలాదిగా తరలిరానున్నారన్నారు. మాజీ మంత్రి ఎరబ్రెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. కేటీఆర్ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, పట్టణ ప్రజలు, వివిధ రంగాల మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు మర్రి యా దవ రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, ఎల్లావుల లలితా యాదవ్, రమేష్ బాబు, జోరిక రమేష్, ప్రశాంత్, శోధన్, సదానందం, నయిముద్దీన్ పాల్గొన్నారు.


