రఘునాథపల్లి: అర్హులైన ప్రతీ కుటుంబం ఇందిర మ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా సూచించారు. శనివారం నిడిగొండ జీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పథకం నమోదు ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, డేటా ఎంట్రీ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీ ఆధారంగానే వివరాలను నమోదు చేయాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరబాట్లు జరగకుండా ఫోన్, ఆధార్ నంబర్లను ఖచ్చితంగా సరి చూడాలన్నారు. ఎంపీడీఓ శ్రీనివాసన్‌కావ్య, మారుజోడు రాంబాబు, సర్పంచ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా


