ఉద్యోగుల ఐక్యతకు టీఎన్జీఓస్‌ జెండా ప్రతీక | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఐక్యతకు టీఎన్జీఓస్‌ జెండా ప్రతీక

Aug 23 2026 1:10 AM | Updated on Aug 23 2026 1:10 AM

జనగామ: ఉద్యోగుల ఐక్యత, హక్కుల సాధనకు టీఎన్జీఓస్‌ జెండా ప్రతీకగా నిలుస్తుందని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కాజా షరీఫ్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్‌ భవన్‌లో సంఘం అధికారిక జెండా, కండువా, ‘ఉద్యోగ గొంతుక’ మాసపత్రికను రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కాజా షరీఫ్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యోగ గొంతుక మాసపత్రిక కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్వారం ప్రభాకర్‌తో పాటు హఫీజ్‌ చందర్‌, రమేష్‌, రాజేశ్‌, మహేష్‌, రామనర్సయ్య, నాగార్జున, యశోద, స్టెల్లా, సంపూర్ణ, లక్ష్మి, లావణ్య, అరుణ, యాకూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement