న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2026
తొలిగిపోయే ఓటర్లు
ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల
● మరణించిన వారు 18,615
● శాశ్వతంగా తొలిగిపోయిన ఓటర్లు 35,428
● మొత్తం ఓటర్లు 7,67,484.. డిజిటలైజేషన్ 7,03,593 మంది
● అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా
జనగామ: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ముందంజలో ఉండగా, జనగామ నియోజకవర్గం వెనుకబడి ఉంది. మరోవైపు డిజిటలైజేషన్ చేసిన ఓటర్లలో అనామలీస్ (అసంగత వివరాలు) శాతం పాలకుర్తిలో అత్యధికంగా నమోదైంది. ఓట ర్ల జాబితాలో మరణించిన వారు, ఆచూకీ లేని వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలినవారు, ఇతర కేటగిరీలను కలిపిన ఏఎస్‌డీ ఓటర్ల శాతం జనగామ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తంగా ఏఎస్‌డీ కేటగిరీ(చిరునామాలో ప్రస్తుతం లేని వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాని కి వెళ్లిన వారు, మరణించిన వారు)లో 18,615 మంది మరణించిన వారు ఉండగా, 1,008 మంది ఆచూకీ లేని వారుగా ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు. 35,428 మంది శాశ్వతంగా తరలిపోగా, 163 మంది ఇతర కేటగిరీలో ఉన్నట్లు చూపించగా, మరో 8,677 మంది ఇప్పటికే నమోదు అయిన వారిగా గుర్తించగా, ఈ మొత్తం 63,891గా ముసాయిదాలో చూపించారు. డిజిటలైజేషన్‌లో స్టేషన్‌ఘన్‌పూర్ ముందుండగా, అనామలీస్, మ్యాపింగ్ లేని ఓటర్ల శాతంలో పాలకుర్తి, ఏఎస్‌డీ ఓటర్ల శాతంలో జనగామ నియోజకవర్గాలు అధికంగా ఉన్నాయి. ఈ వివరాల ఆధారంగా తదుపరి దశలో క్షేత్రస్థాయి పరిశీలన, ధ్రువీ కరణ కీలకంగా మారనుంది. ఏఎస్‌డీని మినహాయిస్తే జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్టే.
7,03,593 మంది ఓటర్లు
ఎస్‌ఐఆర్‌లో భాగంగా జూన్ 10 నాటికి మూడు నియోజకవర్గాల్లో కలిపి 7,67,484 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,03,593 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ అయ్యాయి. అంటే మొత్తం 91.68 శాతం ప్రక్రియ పూర్తయింది. డిజిటలైజేషన్ చేసిన ఓటర్లలో 1,34,392 మంది (19.10 శాతం) అనామలీస్ కేటగిరీలో ఉండగా, 29,465 మంది (4.19 శాతం) ఓటర్లకు మ్యాపింగ్ కాలేదు. మొత్తం 63,891 మంది (8.32 శాతం) ఏఎస్‌డీ(చిరునామాలో ప్రస్తుతం లేని వారు, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిన వారు, మరణించిన వారు) కేటగిరీలో ఉన్నారు.
ఘన్ పూర్ ముందంజ
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 2,56,806 మంది ఓటర్లు ఉండగా 2,39,750 మంది వివరాలు డిజి టలైజేషన్ చేశారు. దీంతో 93.36 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది మూడు నియోజకవర్గాల్లో అత్యధికం. డిజిటలైజేషన్ చేసిన వారిలో 31,215 మంది (13.02 శాతం) అనామలీస్‌గా ఉన్నారు. 6,746 మంది (2.81 శాతం) ఓటర్లకు మ్యాపింగ్ కాలేదు. ఏఎస్‌డీ కేటగిరీలో 17,056 మంది (6.64 శాతం) ఉన్నారు. ఇందులో 4,665 మంది మరణించిన వారు, 318 మంది ఆచూకీ లేనివారు, 9,419 మంది ఇతర ప్రాంతాలకు తరలినవారు, 21 మంది ఇతర కేటగిరీలో ఉండగా, 2,633 మంది ఇప్పటికే నమోదు అయినవారిగా గుర్తించారు.
పాలకుర్తిలో అనామలీస్ ఎక్కువ
పాలకుర్తిలో మొత్తం 2,61,241 మంది ఓటర్లు ఉండగా, 2,41,462 మంది వివరాలు డిజిటల్ చేశారు. డిజిటలైజేషన్ 92.43 శాతంగా ఉంది. అయితే అనామలీస్ విషయంలో ఈ నియోజకవర్గం ముందుంది. డిజిటలైజేషన్ చేసిన ఓటర్లలో 57,177 మంది అంటే 23.68 శాతం అనా మలీస్ కేటగిరీలో ఉన్నారు. 12,776 మంది (5.29 శాతం) ఓటర్లకు మ్యాపింగ్ కాలేదు. ఏఎస్‌డీ ఓట ర్లు 19,779 మంది (7.57 శాతం)గా ఉన్నారు. వీరి లో 7,795 మంది మరణించినవారు, 210 మంది ఆచూకీ లేనివారు, 8,393 మంది శాశ్వతంగా తరలినవారు, 85 మంది ఇతర కేటగిరీలో ఉండగా, 3,296 మంది ఇప్పటికే నమోదు అయినవారిగా గుర్తించారు.
జనగామలో డిజిటలైజేషన్ తక్కువ.. ఏఎస్‌డీ ఎక్కువ
జనగామ నియోజకవర్గంలో మొత్తం 2,49,437 మంది ఓటర్లు ఉండగా, 2,2 2,381 మంది వివరాలు డిజిటల్ అయ్యాయి. డిజిటలైజేషన్ 89.15 శాతంగా నమోదైంది. మూడు నియోజకవర్గాల్లో ఇదే అత్యల్పం. డిజిటల్ చేసిన ఓటర్లలో 46 వేల మంది (20.69 శాతం) అనామలీస్ కేటగిరీలో ఉన్నారు. 9,943 మంది (4.47 శాతం) ఓటర్లకు మ్యాపింగ్ కాలేదు. ఇందులో ఏఎస్‌డీ ఓటర్లు 27,056 మంది (10.85 శాతం)గా నమోదయ్యారు. వీరిలో 6,155 మంది మరణించినవారు, 480 మంది ఆచూకీ లేనివారు, 17,616 మంది శాశ్వతంగా తరలినవారు, 57 మంది ఇతర కేటగిరీలో ఉండగా, 2,748 మంది ఇప్పటికే నమోదు అయినవారిగా గుర్తించారు.
క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ
17నుంచి వచ్చేనెల 16వరకు
ముసాయిదా ప్రచురణ 17వ తేదీ
తుది ప్రచురణ
అక్టోబర్ 19వ తేదీ
నోటీసుల దశ/క్లెయిమ్‌లు
17నుంచి
అక్టోబర్ 15 వరకు
అభ్యంతరాల పరిష్కారం
వివరాలు సరిచూసుకోండి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ: ముసాయిదా జాబితాలో ప్రతి ఓట రూ తమ పేరు, వయసు, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. అర్హత ఉన్నప్పటికీ పేరు లేకపోయినా, నమోదైన వివరాల్లో తప్పులు ఉన్నా సెప్టెంబర్ 16లోగా దావాలు, అభ్యంతరాలు సమర్పించవచ్చన్నారు. కొత్తగా పేరు నమోదు కోసం ఫారం–6, పేరు తొలగింపు లేదా నమోదుపై అభ్యంతరానికి ఫారం–7, వివరాల సవరణ లేదా నివాస మార్పు కోసం ఫారం–8 వినియోగించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల ను బీఎల్‌ఓలకు నేరుగా ఇవ్వడంతోపాటు ఈసీఐనెట్ యాప్, ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చన్నారు. పోలింగ్ కేంద్రాలు, బీఎల్‌ఓలు, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో జాబితా అందుబాటులో ఉందన్నారు. ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతీ పౌరుడు జాబితాను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.


