ప్రమాదాల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు చర్యలు

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

జనగామ: వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిలో ప్రమాదాలను తగ్గించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు వరంగల్‌ సీపీ శ్వేత తెలిపారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్‌, జాతీయ రహదారి పీడీ నిరంజన్‌రెడ్డిలతో కలిసి సీపీ శ్వేత సమావేశానికి ముఖ్యఅతిథిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో సుమారు 46 కిలోమీటర్ల జాతీయ రహదారిని ఇటీవల అధికారులు క్షేత్రస్థాయిలో పరి శీలించి నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, ప్ర ధాన జంక్షన్లు, తగినంత వెలుతురు లేని ప్రదేశాల ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ జిల్లా పరిధిలో వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రమాద రహిత రవాణా, సురక్షిత ప్రయాణం, మెరుగైన రహదారి మౌలిక వసతుల కల్పన దిశగా చర్యలను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌, ఆర్డీఓ గోపీరాం, ఎస్‌ఈ ఎన్‌పీడీసీఎల్‌ సంపత్‌ రెడ్డి, డీఎల్‌పీఓ వెంకట్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భరోసా కేంద్రం ప్రజలకు చేరువ కావాలి

జనగామ రూరల్‌: భరోసా కేంద్రం ప్రజలకు మరింత చేరువ కావాలని సీపీ ఎన్‌. శ్వేత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి కేంద్రంలో అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సువర్ణ, ఏసీపీలు భీంశర్మ, నర్సయ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ సీపీ శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement