శ్రావణ పూజలు షురూ | - | Sakshi
Sakshi News home page

శ్రావణ పూజలు షురూ

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

జనగామ: శ్రావణమాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గామాత ఆలయంలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అభిషేకా లు, పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లావ్యాప్తంగా శ్రావణమాస పర్వదినాలు ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement