బ్యాంకింగ్‌ సేవలు మరింత చేరువ కావాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ సేవలు మరింత చేరువ కావాలి

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

జనగామ రూరల్‌: జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో బ్యాంకింగ్‌ రంగం ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, రుణ లక్ష్యాలు, వ్యవసాయ రుణాల పంపిణీ, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్షించారు. వ్యవసాయ, పంట రుణాల పంపిణీలో జాప్యం ఉండొద్దని స్పష్టం చేశారు. ఈ సమన్వయ సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రతిభ, డీఏఓ అంబికా సోనీ, డీఆర్డీఓ భాస్కర్‌, ఏపీడీ నూరుద్దీన్‌, ఏడీ ఎస్సీ కార్పొరేషన్‌ మాధవి లత, బ్యాంకు ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement