వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఒక్క రోజు ఇంటర్నల్ టోర్నమెంట్ నిర్వహించారు. 60 ప్లస్ కేటగిరీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ డాక్టర్ ఎరగ్రట్టు స్వామి–కె. రవిచంద్ర, కుంజ్ బిహారి–పి. వెంకటేశ్వరరావు మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఎరగ్రట్టు స్వామి, రవిచంద్ర జట్టు విజేతగా నిలిచింది. ఓపెన్ కేటగిరీ డబుల్స్ విభాగంలో వినీల్‌కుమార్, శ్రీనివాస్ జట్టు విజేతగా నిలవగా, ద్వితీయ స్థానంలో ప్రదీప్త, కార్తికేయ జట్టు ట్రోఫీని అందుకుంది. సింగిల్స్ విభాగంలో ప్రథమ స్థానంలో టి.సాత్విక్, ద్వితీయ స్థానంలో వినీల్ కుమార్ విజేతలుగా నిలిచారు.


