జనగామ: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు మండలాల వారీగా కన్వీనర్లను నియమించినట్లు కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారా యణ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.. కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు ఉడుత రవిని కన్వీనర్‌గా నియమించినట్లు తెలిపారు. జఫర్‌గఢ్, తరిగొ ప్పుల మండలాలకు కీసర దిలీప్‌రెడ్డి, పాలకుర్తి, చిల్పూర్ మండలాలకు గుడి వంశీధర్‌రెడ్డి, రఘునాథపల్లి, లింగాలఘన్‌పూర్ మండలాల బాధ్యతలను కొత్త కరుణాకర్‌రెడ్డికి అప్పగించినట్లు తెలిపా రు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, టౌన్‌కు నూకల బాల్‌రెడ్డి, జనగామ మండలం, టౌన్‌కు ఉప్పల సురేష్ బాబును కన్వీనర్‌గా కేటాయించినట్లు చెప్పారు. నర్మెట, బచ్చన్నపేట మండలాల బాధ్యతలను లింగాల జగదీశ్ చందర్‌రెడ్డికి అప్పగించడం జరిగిందన్నారు. మండలాల వారీగా కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయా మండలాల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సూచించారు.


