న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026
అన్‌కలెక్టబుల్ ఫారాలు
54,317
జనగామ: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జిల్లా 90.31శాతం డిజిటైజేషన్ పూర్తి చేసింది. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో 7,67,484 మంది ఓటర్లు ఉండగా, వీరికి సంబంధించిన ఎలక్టర్స్ ఫారాల డౌన్‌న్‌లోడ్, ముద్రణ, పంపిణీ ప్రక్రియ 100 శాతం పూర్తయింది. ఇందులో 6,93,101 ఫారాలు డిజిటైజ్ కాగా, మరో 20,066 ఫారాలు డిజిటైజ్ కావాల్సి ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే స్టేషన్ ఘన్ పూర్‌లో 2,56,806 మంది ఓటర్లకు సంబంధించి 2,36,826 ఫారాలు (92.22 శాతం) డిజిటైజేషన్ పూర్తి చేశారు. పాలకుర్తిలో 2,61,241 మంది ఓటర్లకు గాను 2,41,590 (92.48 శాతం) ఫారాలు, జనగామలో 2,49,437 మంది ఓటర్లకు గాను 2,14,685 (86.07 శాతం) ఫారాలను డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పాలకుర్తి 92.48 శాతంతో డిజిటైజేషన్‌లో మొదటి స్థానంలో ఉండగా, స్టేషన్‌ఘన్‌పూర్ 92.22 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. జనగామ 86.07 శాతంతో మూడో స్థానంలో ఉంది.
అన్‌కలెక్టబుల్ ఫారాలు..54,317
ఎస్‌ఐఆర్‌లో కీలకంగా కనిపిస్తున్న అంశం అన్‌కలెక్టబుల్ ఫారాలు. జిల్లాలో మొత్తం 54,317 ఫారాలు (7.08 శాతం) అన్‌కలెక్టబుల్‌గా నమోదయ్యాయి. జనగామలో 19,656 (7.88 శాతం), ఘన్‌పూర్‌లో 15,567 (6.06 శాతం), పాలకుర్తిలో 19,094 (7.31 శాతం) ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 1,50,902 అనామలీస్ (19.66 శాతం)గా రిపోర్టులో నమోదయ్యాయి. ఇందులో సైతం అభ్యంతరాల మేరకు ఫారాలను మరోసారి పరిశీలన చేస్తారు.
అన్‌కలెక్టబుల్ అంటే?
ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అన్‌కలెక్టబుల్ అనే పదం కీలకంగా మారింది. ఓటర్ల జాబితా ధ్రువీకరణ కోసం బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు సేకరిస్తారు. ఈ క్రమంలో మూడుసార్లు వెళ్లినా ఓటరు ఇంట్లో లేకపోవడం, ఇల్లు తాళం వేసి ఉండటం, తప్పుడు చిరునామా లేదా ఆ వ్యక్తి వేరే ప్రాంతానికి వలస వెళ్లడం వంటి కారణాల వల్ల సమాచారం సేకరించలేకపోతే వారిని అన్‌కలెక్టబుల్ కేటగిరీలో నమోదు చేస్తారు. అనంతరం అధికారులు సంబంధిత ఓటరుకు నోటీసు పంపి, స్వయంగా కార్యాలయానికి వచ్చి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచిస్తారు.
అనామలీస్ అంటే?
ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సరిచేసే ప్రక్రియ. ఎస్‌ఐఆర్ సమయంలో బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి డేటా సేకరించే సమయంలో కనిపించే తప్పులు లేదా అనుమానాస్పద విషయాలను అనామలీస్ అంటారు. ఒకే పేరు 2 చోట్ల ఉండ డం, చనిపోయిన వారి పేర్లు జాబితాలో రావడం, అడ్రస్ మారినా పేరు పాత చోటే నమోదై కనిపించడం, 18 ఏళ్లు నిండని వారి పేరు ఉండడం, ఫొటో, డాక్యుమెంట్ మ్యాచ్ కాకపోవడం, ఒకే ఇంట్లో పదిమందికి పైగా అనుమానాస్పద కుటుంబ సభ్యులు కనిపిస్తే బీఎల్‌ఓ దాన్ని అనామలీస్ ఫ్లాగ్ చేస్తారు. తర్వాత ఈఆర్‌ఓ విచారణ జరిపి, సరైన డాక్యుమెంట్స్ అడిగి, అవసరమైతే పేరును తొలగిస్తారు లేదా సరిచేస్తారు.
6,93,101
1,50,902
ఫారాల
డిజిటైజ్
అనామలీస్ ఫారాలు
తప్పుల సవరణకు అవకాశం
మామునూరు: వరంగల్ మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతి ప్రవేశానికి నిర్వహించననున్న పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే మంగళ, బుధవారం (11, 12) తేదీల్లో సరిచేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు నవోదయ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే మీడియంతోపాటు కులం, లింగం, ప్రాంతం, దివ్యాంగత్వం ఆన్‌లైన్‌లో దిద్దుబాటుకు విండో (కరెక్షన్) అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు.
కర్రెగుట్టల్లో డీజీపీ ఆనంద్ పర్యటన
జిల్లాలో ఎస్‌ఐఆర్ డిజిటైజేషన్
90.31 శాతం
మొత్తం 6.93 లక్షల ఫారాల డిజిటైజ్
మొదటి స్థానంలో పాలకుర్తి
నియోజకవర్గం
అన్‌కలెక్టబుల్ ఫారాలు 54,317, అనామలీస్ ఫారాలు 1,50,902
నియోజకవర్గం ఓటర్లు డిజిటైజ్ శాతం అన్‌కలెక్టబుల్ అనామలీస్
జనగామ 2,49,437 2,14,685 86.07 19,656 48,641
స్టేషన్ ఘన్‌పూర్ 2,56,806 2,36,826 92.22 15,567 46,556
పాలకుర్తి 2,61,241 2,41,590 92.48 19,094 55,705
మొత్తం 7,67,484 6,93,101 90.31 54,317 1,50,902


