● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి
● ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో లేబర్ కోడ్‌ల రద్దుకు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద జైలుభరో కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలయితే 12 గంటల పని విధానం వస్తుందని, ఉద్యోగులకు సామాజిక భద్రత లేకుండా పోతుందన్నారు. ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాస్తారోకోలో విజేందర్, పి. ఉపేందర్, బొట్ల శేఖ ర్, జోగు ప్రకాష్, మీట్య నాయక్ కుమార్, బూడిద ప్రశాంత్, అజారుద్దీన్, వెంకటేష్, మల్లేశ్ రాజ్, కల్యాణి, భవాని, లలిత, వరలక్ష్మీ పాల్గొన్నారు.


