చిల్పూరు: 41 ఏళ్లుగా తమకు చెందిన భూమిలో పంటలు పండించుకుని 7 ఏళ్ల క్రితం క్రషర్‌కు లీజుకు ఇవ్వగా, ఇటీవల ఇది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు నోటీసులు జారీ చేశారని, అయితే తమ భూమి ఎక్కడ ఉందో అధికారులు చూపించాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. చిల్పూరుకు చెందిన యాట రమేశ్–రజిత దంపతులు 1985లో 126/బీలో 3ఎకరాల12 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో 11 బో ర్లు వేయించగా రెండు బోర్లలో నీరు రావడంతో వ్య వసాయం చేసేవారు. రానురాను కోతులు, అడవి పందుల బెడద తీవ్రం కావడంతో 2019లో క్రషర్ వారికి లీజుకు ఇచ్చారు. ఇటీవల అధికారులు 229 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ నోటీసులు జారీ చేశారని అయితే తమ భూమి ఎక్కడ ఉందో వారే తెలుపాలని అన్నారు. తమ భూమికి సంబంధించిన అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నాయని ఈ విషయంలో కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అధికారులకు భూబాధితుల వేడుకోలు


