రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిగురించిన ఆశలు
వాన కురిసే..
జనగామ: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. స్టేషన్ ఘన్‌పూర్, బచ్చన్నపేట, జనగామ, జఫర్‌గఢ్, కొడకండ్ల, పాలకుర్తి, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల్లో వరి నాట్లు వేగంగా సాగుతున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇప్పగూడెం, తానేదారిపల్లి, విశ్వనాథపురం, శివునిపల్లి, నమిలి గొండ, తాటికొండ గ్రామాల్లో రైతులు దుక్కులు దున్ని వెంటనే నాట్లు వేస్తున్నారు. బచ్చన్నపేటలో వర్షాన్ని లెక్కచేయకుండా రైతులు వరి నాట్లతో పాటు పత్తి చేలకు మందులు పిచికారీ చేస్తున్నారు. జఫర్‌గఢ్‌లో బోరుబావుల ఆధారంగా సాగుతున్న వరి నాట్లు వర్షాలతో మరింత ఊపందుకోగా, వర్షాభావంతో ఎదుగుదల మందగించిన పత్తి పంటకు జీవం వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. కొడకండ్లలో రెండు వారాల ఎండ తర్వాత కురిసిన వానలు పంటలకు ఊరటనిచ్చాయి. లింగాలఘణపురం మండలంలో ఖరీఫ్‌లో 17 వేల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా ఉండగా, ఇప్పటి వరకు 8 వేల ఎకరాల్లోనే సాగు పూర్తయింది. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగితే సాగు విస్తీర్ణం గణనీ యంగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేస్తేనే మేలని అధికారులు సూచిస్తున్నారు.
పంటల సాగులో పురోగతి
జిల్లాలో వానాకాలం పంటల సాగు కొనసాగుతోంది. గత వారం వరకు 2,41,193 ఎకరాల్లో సాగు కాగా, జులై 4వ వారం వరకు 23,994 ఎకరాలు అదనంగా సాగైంది. దీంతో మొత్తం సాగు 2,65, 187 ఎకరాలకు చేరింది. ప్రధా న పంటల్లో పత్తి 1,38,325 ఎకరాల్లో, వరి 1,13,105 ఎకరాల్లో సాగు పూర్తయింది. వరి కింద జులై 4వ వారంలో 17, 452 ఎకరాలు కొత్తగా సాగైంది. కంది 4,777, మొక్కజొన్న 4,895, ధానించా 2,858, పెసర 818, కౌపియా 162 ఎకరాల్లో సాగు జరిగింది.
మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు
జిల్లాలో ఈనెల 27నుంచి29 వరకు వివిధ మండలాల్లో వర్షాలు కురిశాయి. 27, 28 తేదీల్లో జఫర్‌గఢ్‌లో లో 28.0 మి.మీ, పడమటికేశ్వాపూర్‌లో 16.5 మి.మీ నమోదయ్యాయి. 28,29 తేదీల్లో చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో 34.3 మి.మీ, దేవరుప్పులలో 28.0 మి.మీ, నర్మెటలో 27.3 మి.మీ, జఫర్‌గఢ్ కూనూర్‌లో 21.3 మి.మీ, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండలో 20.8 మి.మీ, తరిగొప్పుల మండలం అబ్దుల్‌నాగారంలో 20.3 మి.మీ మోస్తరు వర్షం కురిసింది. ఇతర ప్రాంతాల్లో 0.5 నుంచి 15.5 మి.మీ వరకు తేలికపాటి వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
29జెజిఎన్055:నర్సింగాపూర్‌లో పత్తి పంటకు ఊపిరి
29జెజిఎన్054:కొడకండ్లలో నాటు కోసం నారు తీసుకెళ్తున్న రైతులు
29జెజిఎన్705,707,709,:లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శివారు ప్రాంతాల్లో ముమ్మరంగా పొలం పనులు
ఆగస్టు 31 నాటికి ఆరుతడి
పంటల సాగు అంచనా ఎకరాల్లో
ఆముదం,
పొద్దుతిరుగుడు, ఉలవలు
కూరగాయలు
కందులు
మొక్కజొన్న
జొన్నలు
మినుములు
పెసర్లు
5,065
19,710
1,132
2,478
18,545
2,472
3,033
నాకున్న రెండు ఎకరాల్లో బోరుబావిపై ఆధారపడి ఎకరం సాగు చేసిన. వర్షాలు ఆలస్యం కావడంతో సాగు ఇబ్బందులు మొదలుకాగా, వరి నారు కూడా ముదిరిపోయింది. మరో వైపు బోర్‌లో కూడా నీరు తగ్గిపోయింది. ఈ వర్షాలు భూగర్భ జలాలు పెరిగేలా పడితేనే నష్టాలు ఉండవు.
– మంద రాజు, తిమ్మంపేట,జఫర్‌గఢ్
మాకు 10 ఎకరాల సాగు పొలం ఉంది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో ఈ నెల చివరి వారం వరకు నాట్లు వేయకుండా వేచి చూసినం. రెండు రోజులుగా ముసురు కురుస్తుండగా మడులు దున్ని వెంటనే వరి నాట్లు వేయిస్తున్నాం.
– మంతెన ఇంద్రసేనారెడ్డి, తానేదార్‌పల్లి, స్టేషన్‌ఘన్‌పూర్
చిన్నమడూరు –రంబోజిగూడెం గ్రామాల మధ్య నిర్మించిన వంతెనను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే


