జనగామ: నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ప్రసూతి సమయంలో సురక్షితమైన కాన్పులు చేయడం ఆరోగ్య శాఖ లక్ష్యమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వాణిశ్రీ అన్నా రు. ‘గర్భంలోనే తుంచేస్తున్నారు’ శీర్షికన ఈనెల 28వ తేదీన ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు. ప్రభుత్వ దవా ఖానాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామన్నారు. అబార్షన్ చేయించుకుని ఇటీవల మృతి చెందిన మల్కాపురం శ్రావణికి సంబంధించి రఘునాథపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌సీ లబ్ధిదారుల రిజిస్టర్‌లో వివరాలు నమో దు కాలేదని, సాధారణ ఏఎన్‌సీ సేవలు, రిఫరల్ కూడా లేవన్నారు. ఆమె ఆధార్‌లో చిరునామా హైదరాబాద్ మియాపూర్‌గా ఉందన్నారు. శ్రావ ణి తల్లి కోలుకొండకు చెందిన ఆర్‌ఎంపీని సంప్రదించి, జనగామ సంజయ్‌నగర్‌లోని ప్రైవేటు ఏఎన్‌ఎం అనసూర్య వద్దకు వెళ్లినట్లు తెలిపారు. అనసూర్య సూచన మేరకు లింగనిర్ధాణ కోసం హనుమకొండలోని ప్రవీణ్‌ను సంప్రదించినట్లు చెప్పారు. స్కానింగ్ తర్వాత గర్భంలో అడ శిశువుగా నిర్దారించుకుని, గర్భస్రావం కోసం తిరిగి అనసూర్య వద్దకు వచ్చారన్నారు. ఇక్కడ అబార్షన్ చేయగా, అధిక రక్తస్రావం జరగడంతో ఆయా ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి, చివరకు గాంధీకి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు.
మృతి చెందిన శ్రావణి
జిల్లాలో సేవలు పొందలేదు
అబార్షన్ ఘటనపై
డీఎంహెచ్‌ఓ నివేదిక


