ఎవరిని కలిశారు..? ఎంత ఇచ్చారు? | - | Sakshi
Sakshi News home page

ఎవరిని కలిశారు..? ఎంత ఇచ్చారు?

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

జనగామ: జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ వైద్య సిబ్బంది నిర్వహించిన అక్రమ అబార్షన్‌ ఘటనపై రాష్ట్ర పీసీపీఎన్‌న్‌డీటీ ప్రోగ్రాం ఆఫీసర్‌ సుమిత్రాదేవి బుధవారం జిల్లాలో పర్యటించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వాణిశ్రీతో కలిసి దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి వెళ్లి మృతురాలి తల్లి వద్దకు వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. అబార్షన్‌ కోసం ఎవరిని సంప్రదించా రు..ఎవరితో వెళ్లారు.. ఎంత మొత్తాన్ని చెల్లించారు.. చికిత్స ఎక్కడ నిర్వహించారనే అంశాలపై బాధిత కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. మృతురాలి తల్లితో ప్రత్యేకంగా మాట్లాడి జరిగిన పరి ణామాలు, కేసు నమోదు తదితర వివరాలపై ఆరా తీశారు. స్కానింగ్‌ కోసం రూ.50 వేల వరకు చెల్లించినట్లు మృతురాలి తల్లి తెలిపినట్లు డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ వెల్లడించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాల అనుమతులు, ధ్రువపత్రాలను వైద్యశాఖ అధికారులు పరిశీలించారు. ఆర్‌ఎంపీలు సమస్యలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్‌ చేయాలని సూచించా లే తప్ప, కమీషన్ల కోసం అనుమతులు లేని వ్యక్తులు, కేంద్రాల వద్దకు రోగులను పంపిస్తే చట్టపరమై న చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉండగా, హనుమకొండకు చెందిన స్కానింగ్‌ కేంద్ర నిర్వాహకుడు ప్రవీణ్‌ పట్టుబడితే ఘటన వెనుక ఉన్న పూర్తి వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అబార్షన్‌ ఘటనపై రాష్ట్ర పీసీపీఎన్‌డీటీ ప్రోగ్రాం అధికారి విచారణ

మృతురాలి తల్లి నుంచి వివరాల సేకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement