● స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం శాఖలవారీగా పంచుకుని తెలంగాణ వనరులను దోచుకున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. మేడిగడ్డ కుంగిపోతే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చు కదా అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అఽథారిటీ సూచనల మేరకే పనిచేస్తాయని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వినయ్‌కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్‌రాజ్, నాయకులు నీల గట్టయ్య, బూర్ల శంకర్, గన్ను నర్సింహులు, గట్టు రమేశ్, గుర్రం రమేశ్, పోశాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


