బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి | - | Sakshi
Sakshi News home page

బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్‌ఐఆర్‌ పేరుతో రాష్ట్రంలో భారీగా ఓట్లను తొలగించే ఉద్దేశ్యంతో ఉందని, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులంతా కలిసి బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య ఆరోపించారు. పట్టణ కేంద్రంలో ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌)పై నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు, సర్పంచ్‌లతో ఆదివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడారు.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతగా నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా సవరణలో ఘన్‌పూర్‌ నియోజకవర్గం రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలువాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈనెల 25న మరోసారి నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంటుందని, ప్రతీ బూత్‌లో 95 శాతం ఎన్యుమరేషన్‌ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఏఐసీసీ పరిశీలకులు అహ్మద్‌ నాసిర్‌, టీపీసీసీ నియోజకవర్గ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, మాస్టర్‌ ట్రైనర్‌ రాజశేఖర్‌రెడ్డి, హనుమకొండ, జనగామ డీసీసీ అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, ధన్వంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మారుడోజు రాంబాబు, మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ జూలుకుంట్ల లావణ్య, పార్టీ మండల, ఘన్‌పూర్‌ పట్టణ అధ్యక్షులు శిరీష్‌రెడ్డి, కిషన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ ఎంపీ కడియం కావ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement