జనగామ రూరల్: జిల్లాలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాఖ యూనిట్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు నిర్వహించిన అర్హత రాత పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో జరిగిన పరీక్ష నిర్వహణ తీరును అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ 1,2 విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌ల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిపై భర్తీ చేసేందుకు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కాగా, వివిధ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, చైన్‌న్‌మెన్, స్వీపర్, ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు మొత్తం 615 మంది అభ్యర్థులు దరఖాస్తులు స్వీకరించగా, 446 మంది అభ్యర్థుల పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కుమారస్వామి, జీసీడీఓ గౌసియాబేగం, విద్యాశాఖల సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


