వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. నాకున్న ఎకరంతో పాటు మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న. రెండు నెలల క్రితం పోసిన వరి నారు ముదిరిపోయింది. ఈ సీజన్‌లో మోస్తరు వర్షం కూడా లేక, దుక్కుల నుంచి కిందికి నీళ్లు జార లేదు. వర్షాలు లేక బోరు, బావిలో నీళ్లు ఇంకిపోయాయి. పంటల దిగుబడి రాకపోయినా కౌలుకు డబ్బులు ఇవ్వాల్సిందే. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.
–దొరగొల్ల కొండయ్య, రైతు,
ఇబ్రహీంపూర్, రఘునాథపల్లి
ఎకరమే పారుతోంది..
ఆరు ఎకరాల పొలంలో వరి కోసం నాలుగు ఎకరాలు సిద్ధం చేశాం. పెట్టుబడి కోసం రూ.లక్ష ఖర్చు చేశాం. సాగునీరుతో ఎకరం కూడా పారడం లేదు. మిగతా పంట ఎండి పోయేదశలో ఉంది. దేవాదుల ద్వారా సాగునీరు లేకపోవడం, వర్షాభావ పరిస్థితులతో బోర్లు వట్టిపోతున్నాయి.
–భూస భాగ్యమ్మ, మహిళా రైతు,
గోపిరాజుపల్లి, జనగామ మండలం


