జిల్లాలో టెట్ ఫలితాల వివరాలు
● పేపర్–1లో మెరుగు.. పేపర్–2లో నిరాశ
జనగామ: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం విడుదల కాగా, జిల్లాలో పేపర్–1తో పోలిస్తే పేపర్–2లో అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. ముఖ్యంగా గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ విభాగాల్లో అర్హత సాధించిన వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఓవరాల్‌గా రెండు పేపర్లలో 1,565 మంది పరీక్షలు రాయగా, కేవలం 489 మాత్రమే అర్హత సాధించడంతో 31.25శాతం పాస్ శాతం నమోదైంది. రాబోయే ఉపాధ్యాయ నియామకాల దృష్ట్యా అభ్యర్థులు సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు టెట్ విధానంపై మరింత అవగాహన పెంచుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ అయితే ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తీర్ణత శాతం
పరీక్షరాసినవారు
ఉత్తీర్ణులు
489
1,565
355
207
675
535
172
110
పేపర్–2 (మ్యాథ్స్,సైన్స్)
పేపర్–2
(సోషల్)
మొత్తం
పేపర్–1


