సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి

Apr 10 2025 1:25 AM | Updated on Apr 10 2025 1:25 AM

సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి

సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి

సీనియర్‌ సివిల్‌ జడ్జి సి.విక్రమ్‌

జనగామ రూరల్‌: వృద్ధులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి సి.విక్రమ్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రపంచ ఆరోగ్య దినం పురస్కరించుకుని ఓబుల్‌ కేశవాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంయుక్తంగా కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమంలో వైద్య, కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కంటిచూపు మందగిస్తుందని, అవసరమైన శస్త్రచికిత్సలు చేసుకుని అద్దాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రవీందర్‌, ఆశ్రమ ఇన్‌చార్జ్‌ డి.లక్ష్మ ణ్‌, ఫ్లోరెన్స్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement