యూరియా కొరత సృష్టిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

యూరియా కొరత సృష్టిస్తే చర్యలు

Jul 30 2025 7:20 AM | Updated on Jul 30 2025 7:20 AM

యూరియ

యూరియా కొరత సృష్టిస్తే చర్యలు

రఘునాథపల్లి: జిల్లాలో యూరియా కొరత లేదని, కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని అగ్రోస్‌ రైతు సేవా కేంద్రం ఫర్టిలైజర్‌ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్లు, లైసెన్స్‌, స్టాక్‌ బోర్డు, భౌతిక నిల్వ, రైతులకు అమ్మిన ఎరువుల వివరాలను పరిశీలించారు. యూరియా కొనుగోలు చేసిన రైతుల వివరాల ఫోన్‌ నంబర్లతో సహా రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వసంత సుగుణ, మండల వ్యవసాయాధికారి కాకి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం పంపిణీ ఘనత రేవంత్‌రెడ్డిదే..

జనగామ: రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేసి, ఆర్థిక భరోసా కల్పించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని డీసీసీ అధ్యక్షుడు, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 8వ వార్డులో నూతన రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత ప్రజా సమస్యలు, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. అంతకుముందు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, 8వ వార్డు అధ్యక్షుడు కడారి ప్రవీణ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్లు వంగాల కల్యాణి, గాదెపాక రాంచందర్‌, మురళి, చలపతిరెడ్డి, మురళి లబ్ధిదారులు పాల్గొన్నారు.

జనగామ ఎల్‌ఐసీకి

అరుదైన గౌరవం

జనగామ: దేశంలో జనగామ ఎల్‌ఐసీ బ్రాంచ్‌కు అరుదైన గౌరవం దక్కిందని సంస్థ జాతీయస్థా యి ఎండీ రత్నాకర్‌ పట్నాయక్‌ అన్నా రు. మంగళవారం జనగామ ఎల్‌ఐసీ కార్యాలయంలో సంస్థ బ్రాంచ్‌ మేనేజర్‌ గుగులోత్‌ హరిలాల్‌ అధ్యక్షతన జరిగిన విజయోత్సవ వేడుకల్లో ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ మేనేజర్‌ పునీత్‌ కుమార్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథి గా పాల్గొని మాట్లాడారు. 2024–2025 వార్షిక సంవత్సరంలో జనగామ ఎల్‌ఐసీ రికార్డు బిజినెస్‌ సాధించి ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. వ్యాపారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనగామ బ్రాంచ్‌ మొదటి స్థానంలో నిలువగా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల పరిధిలో రెండవ స్థానం దక్కించుకుందన్నారు. ఇదే స్ఫూర్తిలో ఏజెంట్లు కష్టపడి పని చేస్తూ ప్రస్తుత సంవత్సరంలో కూడా రికార్డు సృష్టించాలన్నారు. అనంతరం ఎల్‌ఐసీ ఉద్యోగులు, అధికారులు, ఏజెంట్లు, సిబ్బందిని శా లువాతో సత్కరించి జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో వరంగల్‌ డివిజనల్‌, సీనియర్‌ మేనేజర్లు సుబ్రమణ్యన్‌, సుధాకర్‌బాబు, జె.మోతిలాల్‌, జి.దునీలాల్‌,అమర్నాథ్‌, బి.శ్రీ నివాస్‌, బుచ్చిరెడ్డి, వెంకటరాములు, చిరంజీవి, లాల్‌సింగ్‌, మధుసూదన్‌, శశికళ, డీఓ విజయ్‌ కుమార్‌, టీవీ మ్యాథ్యూస్‌, సాంబశివరావు, కరుణాకర్‌రెడ్డి, ఏజెంట్లు పాల్గొన్నారు.

అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశాల్‌

చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్దెమారి విశాల్‌ తెలంగాణ రా ష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగుల మలిదశ జీ1ఏ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యా రు. మంగళవారం ముషీరాబాద్‌ భవానీ శంకర దేవస్థానంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగవరపు ప్రసాద్‌ నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా విశా ల్‌ మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

యూరియా  కొరత సృష్టిస్తే చర్యలు
1
1/3

యూరియా కొరత సృష్టిస్తే చర్యలు

యూరియా  కొరత సృష్టిస్తే చర్యలు
2
2/3

యూరియా కొరత సృష్టిస్తే చర్యలు

యూరియా  కొరత సృష్టిస్తే చర్యలు
3
3/3

యూరియా కొరత సృష్టిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement