
ఎదురుచూపులు?
రుణానికి
● అర్ధాంతరంగా నిలిచిన ‘రాజీవ్ యువ వికాసం’
● మండల స్థాయిలోనే కొలిక్కిరాని ఎంపికలు
● జిల్లా వ్యాప్తంగా 29,367 దరఖాస్తులు
జనగామ రూరల్: రాజీవ్ యువ వికాసం యూనిట్ల మంజూరులో సందిగ్ధత నెలకొంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంతమందికి మంజూరు పత్రాలు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల స్థాయిలోనే కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వం యూనిట్ల మంజూరు పత్రాల పంపిణీని నిలి పేసింది. ఇప్పుడు ఆర్‌వైవీకి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు.
రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు..
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 8,437 మందికి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 8,437 యూనిట్ల లక్ష్యానికి 29,367 దరఖాస్తులు రావడంతో మండల స్థాయిలో ఎంపిక చేయాలని నిర్ణయించారు.
రాజకీయ ఒత్తిళ్లు..
రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి మండల స్థాయిలోనే అర్హుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. ఈ జాబితాలు జిల్లా స్థాయికి పంపిస్తే అక్కడ బడ్జెట్ అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. కానీ మండల లెవల్ కమిటీలు తుది జాబితాలను పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కమిటీలో ఎంపీడీఓ, మండల స్థాయి డీఆర్డీఏ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది ఉండగా రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తుది జాబితాలు సిద్ధం కాలేదని సమాచారం.
సిబిల్ స్కోర్ చిక్కు..
నిరుద్యోగులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికఅభివృద్ధి పొందేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టి రుణాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అయితే బ్యాంకులు సిబిల్ స్కోర్ తప్పనిసరి అనడంతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు చాలా వరకు పాన్‌కార్డు లేకపోగా సిబిల్ స్కోర్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ పథకానికి సిబిల్ స్కోర్ తొలగించాలని ఇప్పటికే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సిబిల్ స్కోరును మినహాయిస్తే గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులు ఎక్కువగా లబ్ధిపొందే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి సిబిల్ స్కోర్ విధానం ఉంటుందా లేదా అనేది స్పష్టంకానుంది.
కేటగిరీ వారీగా దరఖాస్తులు, కేటాయించిన యూనిట్లు
ఎస్సీ
దరఖాస్తులు 8,779
యూనిట్లు
3500
బీసీ
దరఖాస్తులు 15425
యూనిట్లు
2714
ఈబీసీ
దరఖాస్తులు 447
యూనిట్లు
511
మైనార్టీ
దరఖాస్తులు 981
యూనిట్లు
186
క్రిస్టియన్
మైనార్టీలు
దరఖాస్తులు 48
యూనిట్లు
57
షరతులు లేకుండా రుణాలు అందించాలి
గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలి. జూన్ 2న ఇస్తామని చెప్పినా.. ఇంత వరకు ఆదేశాలు రాకపోవడం నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయ జోక్యం లేకుండా, అర్హులైన వారందరికీ ఆర్థిక భరోసా కల్పించాలి.
– చందూనాయక్, సీపీఎం నాయకుడు
ఎలాంటి ఆదేశాలు రాలేదు..
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇంకా తుది జాబితా కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తాం.
– మాదవి లత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ

ఎదురుచూపులు?

ఎదురుచూపులు?

ఎదురుచూపులు?

ఎదురుచూపులు?

ఎదురుచూపులు?