
ఆన్‌లైన్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి
కొడకండ్ల: ఆన్‌లైన్ సైబర్ మోసాలతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ సందర్శించి పరిసరాలను, సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించి, పరేడ్, లాఠీ డ్రిల్, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ ద్వారా వచ్చే ఓటీపీలను షేర్ చేయవద్దన్నారు. ఫోన్‌లకు వచ్చే అనవసర లింక్‌లు ఓపెన్ చేస్తే మోసాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే రెండు గంటలలోపు 193 సైబర్‌క్రైమ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యా దు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, ఎస్సై చింత రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్రనాయక్