
మానవ అక్రమ రవాణాపై అవగాహన
జనగామ: ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, కార్మికశాఖ చైల్డ్ హెల్ప్‌లైన్, స్కోప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ర్యాలీ నిర్వహించి మానవ అక్రమ రవాణాపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఉప్పలయ్య మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా రైలు మార్గాల ద్వారా జరుగుతుందని, ఏ చిన్న అనుమానం వచ్చిన చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్ మాట్లాడుతూ చిన్నారులు, మహిళలు, వలస కూలీలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి కుమారస్వామి, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్, సిబ్బంది వెంకన్న, మాస్టర్ మల్లికార్జున్, మనోజ్‌కుమార్, లావణ్య, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ రవాణాను నియంత్రించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: మానవ అక్రమ రవాణాను నివారించాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారిణి స్వప్నరాణి అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, జిల్లా కార్మిక విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, స్కోప్ ఎన్‌జీఓ సంయుక్తంగా బుధవారం స్థానిక రైల్వేస్టేషన్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవ అక్రమ రవాణా నివారణకు ప్రతీఒక్కరు బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో స్టేషన్‌మాస్టర్ ఎస్.కుమార్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది నాగరాజు, చిల్పూరు ఏఎస్‌ఐ జయకుమార్, స్కోప్ ఎన్‌జీఓ సిబ్బంది అజిత్‌కుమార్, అశోక్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.