
శేష జీవితం ప్రశాంతంగా గడపాలి..
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఉద్యోగులు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులతో ఆటుపోట్లను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తారని, శేష జీవితం ప్రశాంతంగా గడపాలని కోరారు. జిల్లా సహకార శాఖ అధికారిగా సేవలందించిన రాజేందర్‌రెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా రాజేందర్‌రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. తోటి ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సహకార శాఖకు వన్నె తేవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డిప్యూటీ కలెక్టర్ సుహా సిని, శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.