తరిగొప్పుల: విద్యార్థులు లక్ష్య సాధనతో ముందుకు సాగాలని, క్రమశిక్షణతో మెలగాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పింకేశ్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మెనూ బోర్డును పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రతీ రోజు వందశాతం హాజరు నమోదయ్యేలా.. ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం డీఈఓ బోజన్నతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈఓ నెల్లుట్ల జానకి, ఎంపీడీఓ ఆలేటి దేవేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, పాఠశాల స్పెషల్ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం
జనగామ: రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు నెలలలోపే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సైతం ఆదేశించడం గొప్ప నిర్ణయమన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికై నా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయమై ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించాలని, వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ పార్లమెంటరీ వ్యవస్థను గౌరవించేలా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
జనగామ రూరల్: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు ఆయన జిల్లా కేంద్రంలోని సబ్ జైలును గురువారం సందర్శించారు. జైల్లోని ఖైదీలను పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. న్యాయవాదులను నియమించుకోని ఖైదీలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలన్నారు. ఖైదీల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను కూడా జైల్లో ఏర్పాటు చేసినట్లు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర అడ్వకేట్ దరఖాస్తులు రాసుకోవడానికి సహాయంగా పారా లీగల్ వలంటరీ బి.శేఖర్ అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ కృష్ణకాంత్, వలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని బాల సదనాన్ని సందర్శించారు. బాలికలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రిజిస్టర్లు పరిశీలించారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
చిల్పూరు: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పల్లగుట్ట గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జీడి ప్రీతి, పూర్వ విద్యార్థి కలకోల సంజు ఎంపికై నట్లు హెచ్‌ఎం పెనుమాటి వెంకటేశ్వర్లు, ఫిజికల్ డైరెక్టర్ దేవ్‌సింగ్ తెలిపారు. ఈనెల 28వ తేదీన జిల్లా కేంద్రంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో జూనియర్ ట్రాథలింగ్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆగస్టు 3, 4 తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా గురువారం పాఠశాలలో ఎంపికైన విద్యార్థులను చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, శ్యాంసుందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ప్రకాశ్, అలకనంద, శోభారాణి, రమణకుమార్ తదితరులు అభినందించారు.

లక్ష్య సాధనతో ముందుకు సాగాలి

లక్ష్య సాధనతో ముందుకు సాగాలి