తల్లి పాలే బిడ్డకు శ్రీరామరక్ష! | - | Sakshi
Sakshi News home page

తల్లి పాలే బిడ్డకు శ్రీరామరక్ష!

Aug 2 2025 6:32 AM | Updated on Aug 2 2025 6:32 AM

తల్లి

తల్లి పాలే బిడ్డకు శ్రీరామరక్ష!

తల్లిపాలతో లాభాలు

● తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన ఆహారాన్ని అందిస్తాయి.

● నాణ్యమైన ప్రొటీన్లు, ఒమెగా 3, 6, 9 బిడ్డ మెదడు వికాసానికి తోడ్పడుతాయి.

● తల్లిపాలలో బిడ్డకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టోజుతో కాల్షియం ని ల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి.

● తొలి నెలలో శిశువుకు వివిధ రకాల అంటువ్యాధుల నుంచి కాపాడుతాయి. బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.

● కేన్సర్‌, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండెవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

వారోత్సవాల వివరాలు

● ఆగస్టు 2న ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాధాన్యాన్ని తల్లులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు.

● 4న అన్నప్రాసన ఉంటుంది. అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై అవగాహన కల్పిస్తారు.

● 5న ఇంటింటికి వెళ్లి తల్లిపాల ప్రాధాన్యాన్ని ప్రచారం చేస్తారు.

● 6న చేతులను శుభ్రం చేసుకునే అంశంపై అవగాహన కల్పిస్తారు.

● 7న స్వయం సహాయక సంఘాల సభ్యులు, మోప్మా, సెర్ఫ్‌ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై అవగాహన కల్పిస్తారు.

జనగామ రూరల్‌: పుట్టిన బిడ్డకు తల్లి పాలే శ్రీరామరక్ష. తల్లి పాల పాముఖ్యతను గ్రామీణ ప్రాంత మహిళలకు తెలియజేయడానికి ప్రభుత్వం తల్లి పాల వారోత్సవాలను ప్రతీ ఏటా ని ర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నారు. జిల్లాలోని అంగన్‌వాడీలు, పీహెచ్‌సీల్లో తల్లి పాల వారో త్సవాల నిర్వహనకు మహిళా శిశు సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లో తల్లిదండ్రులతో పాటు ప్రతిఒక్కరూ భాగస్వాములు కానున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల సిబ్బంది, ఆశలు, స్వయం సహాయక సంఘాలు, డీఆర్డీఏ, లైన్‌ డిపార్ట్‌మెంట్ల సిబ్బంది తల్లి పాల ప్రాధాన్యం, ఉపయోగాలపై అవగాహన విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలో 3 ప్రాజెక్టుల పరిధిలో 695 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 25,138 మంది పిల్లలు ఉన్నారు.

తల్లిపాలపై అవగాహన

జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లి పాల ప్రాఽ దాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి ఆరు నెల ల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలు ఇ వ్వకూడదని వైద్యాధికారులు తెలిపారు. తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయని, శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయన్నాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8 నుంచి 10 సార్లు లేదా ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుందన్నారు. బిడ్డకు పాలిచ్చే సమయంలో కెఫి న్‌ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానియాలు తీసుకోరాదని, ఇవి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతాయన్నారు.

మొదలైన తల్లిపాల వారోత్సవాలు

వారం రోజుల పాటు

అవగాహన కార్యక్రమాలు

జిల్లాలో 690 అంగన్‌వాడీల్లో

25,138 మంది చిన్నారులు

అవగాహన కల్పిస్తాం..

జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో తప్పనిసరిగా తల్లి పాల వారోత్సవాలు నిర్వహించాలి. తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన క ల్పించేలా విస్తృతంగా మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతీ అంగన్‌వాడీ టీచర్‌ తప్పనిసరిగా పాల్గొనాలి.

– చౌడేశ్వరీ, ఇన్‌చార్జ్‌ డీడబ్ల్యూఓ

తల్లి పాలే బిడ్డకు శ్రీరామరక్ష!1
1/1

తల్లి పాలే బిడ్డకు శ్రీరామరక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement