
డీఈఓగా అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
● అదనపు బాధ్యతలను అప్పగిస్తూ
ప్రభుత్వం ఉత్తర్వులు
జనగామ: జిల్లా విద్యాశాఖ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఐఏఎస్) పింకేష్‌కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ కార్యాలయంలో ఎఫ్‌ఏఓగా విధులు నిర్వర్తిస్తున్న భోజన్నకు ఈ ఏడాది మే 1వ తేదీన డీఈఓగా ఇన్‌చార్జ్ బాధ్యలను అప్పగించారు. మూడు నెలల కాలం పాటు పని చేసిన ఆయన స్థానంలో ఏసీ ఎల్‌బీకి బాధ్యతలను అప్పగించడంతో.. భోజన్న యాథాస్థితికి వెళ్లనున్నారు. శుక్రవారం పింకేష్‌కుమార్ డీఈఓగా బాధ్యతలను స్వీకరించారు.
ఒక్కరు.. మూడు బాధ్యతలు
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా 12 మండలాల పరిధిలో పంచాయతీల నిర్వహణ, జిల్లా గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వం అమలు చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై దృష్టి సారించాల్సి ఉంటుంది. పురపాలిక పాలక మండలి గడువు ముగియడంతో స్పెషల్ ఆఫీసర్‌గా పింకేష్ కుమార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో అదనపు కలెక్టర్‌తో పాటు పురపాలిక స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు.. డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించడంతో పర్యవేక్షణ పెరిగింది. ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న క్రమంలో మూడో బాధ్యత సత్ఫలితాలు ఇస్తుందా లేదా అనే విషయం కాలం నిర్ణయించనుంది.
పరిశుభ్రతతోనే
ఆరోగ్యవంతమైన సమాజం
నర్మెట: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జునరావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీతో పాటు ఆగపేటలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పరిశీలించి వైద్య, పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డెంగీ పాజిటివ్ వచ్చిన ఇంటిని, పరిసరాలను పరిశీలించి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఏఎన్‌ఎం, ఆశలకు సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి సుకన్య, సూపర్‌వైజర్ పద్మావతి, ఎస్‌ఎన్‌లు సునీత, శ్రీలత, ఆశాజ్యోతి, ఎల్‌టి కుమార్, ఎస్‌ఏ ప్రవీణ్, ఫార్మసిస్ట్ అనిల్ కుమార్, ఏఎన్‌ఎంలు సరిత, విజయశాంతి, శివ తదితరులు ఉన్నారు.
డీసీఓగా కోదండరాములు
జనగామ: జిల్లా సహకార సొసైటీ అధికారి (డీసీఓ/ఫుల్ అడిషనల్ ఇన్‌చార్జ్)గా కె.కోదండరాములు శుక్రవారం బాధ్యతలను తీసుకున్నారు. ప్రస్తుతం పని చేసిన రాజేందర్‌రెడ్డి పదవీ విరమణ పొందగా, ఆయనకు పూర్తి బాధ్యతలను అప్పగించారు. అనంతరం కోదండరాములు కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పాలకుర్తి టౌన్: రాష్ట్ర స్థాయి అఽథ్లెటిక్స్ పోటీలకు పాలకుర్తి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని ధరావత్ గాయత్రి ఎంపికై ంది. జూలై 26న నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో 60 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో ఈనెల 3, 4న హనుమకొండలోని జేఎన్‌ఎస్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్ధాయి పోటీల్లో గాయత్రి పాల్గొననుంది. ఈ మేరకు శుక్రవారం హెచ్‌ఎం పాయం శోభారాణి, పిజికల్ డైరెక్టర్ మామిండ్ల సోంమల్లు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

డీఈఓగా అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్

డీఈఓగా అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్

డీఈఓగా అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్