
మహిళా సాధికారత కోసమే పథకాలు
దేవరుప్పుల: మహిళలు సాధికారత సాధించేందుకు ఇందిరా మహిళా శక్తి పథకాలు దోహదపడతాయని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద వారిద్దరు వనమహోత్సవంలో మొక్కలు నాటారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కామారెడ్డిగూడేనికి చెందిన జిల్లా మేఘన మహిళా సంఘం అధ్యక్షురాలు పులిపంపుల మమత స్వీయ ప్రేరణతో, మహిళా సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన వనిత మహిళా శక్తి క్యాంటీన్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ వసంత, ఏపీడీ నూరొద్దీన్, తహసీల్దార్ ఆండాలు, ఎంపీడీఓ సురేశ్‌కుమార్, విజయ డెయిరీ జిల్లా చైర్మన్ ధర్మారెడ్డి, ఐకేపీ డీపీఎం ప్రకాశ్, ఏపీఎం వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోమేశ్వరాలయంలో పూజలు
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గురువారం ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం