
ఆర్టీఐ బోర్డులు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: ఆర్టీఐ దరఖాస్తుల సమాచారం అందించేందుకు ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం ఆర్టీఐ చట్టంపై అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. హనుమకొండ జిల్లా భూ గర్భ జల శాఖ పర్యవేక్షకుడు ధరంసింగ్ శిక్షణ ఇ చ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని కలెక్టర్ కార్యాలయ ఏఓ శ్రీకాంత్ తదితరు పాల్గొన్నారు.
చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రతిపాదనలు
కలెక్టర్ చాంబర్‌లో జిల్లా స్థాయి చేనేత కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలోని చేనేత కార్మికులు 2017 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2024 మధ్య కాలంలో చేనేత రుణాలు తీసుకున్న 442 కార్మికులకు సంబంధించి రూ. 3,71,35,208లు మాఫీ చేసేందుకు కమిటీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. రుణాలు చెల్లించిన 237 మంది కార్మికులకు సైతం మాఫీ చేసి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపామన్నారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ ఆర్ డీడీ పద్మ, సహాయ సంచాలకులు శ్రీమతి చౌడేశ్వరి వజీర్ సుల్తాన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్, జీఎం ఇండస్ట్రీస్ శివ కృష్ణ, ఠాకూర్ పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
దేవరుప్పుల: ఇంటర్ ప్రవేశానికి పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలతోపాటు స్థానిక హైస్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి.సురేశ్‌కుమార్, ఎంఈఓ కళావతి, హెచ్‌ఎం విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్