
ముఖ చిత్రమే ముఖ్యమిక!
జనగామ: ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరు పట్టికలో సంతకాలు పెట్టే రోజులు పోయినట్లే. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్) విధానం కొనసాగుతుండగా.. నేటి (శుక్రవారం) నుంచి టీచర్లకు వర్తింపజేయనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయగా.. పాఠశాల విద్యాశాఖ యాప్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ సమాచారాన్ని పొందుపర్చారు. బడి సమయం దాటిన తర్వాత ఉపాధ్యాయులు వచ్చి హాజరు పట్టికలో సంతకాలు పెట్టే పరిస్థితి ఇక నుంచి ఉండదు. ముఖ కదలిక ఐ రిష్ అటెండెన్స్ ద్వారా టీచర్లు ఎన్ని గంటలకు వ చ్చారనే విషయం ఇట్టే తెలిసిపోనుంది. సాయంత్రం బడి ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు తప్పనిసరి చేశారు.
నేటి నుంచి అమలు..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సంబంధించిన ఫేస్ రికగ్నైజేషన్ ఆధారిత హాజరు నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఈపద్ధతిని ముందుగా విద్యార్థుల హాజరు కోసం ప్రవేశపెట్టగా, ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో 29,300 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. కొంత కాలంగా విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ ిసిస్టం ద్వారా అటెండెన్స్ తీసుకుంటున్నారు. విద్యార్థి ప్రతి రోజు స్కూల్‌కి వచ్చిన తర్వాత వారి ముఖ, ఐరిష్ వివరాల ఆధారంగా యాప్‌లో హాజరు తీసుకుంటున్నారు. ఆవివరాల్ని వెంటనే రాష్ట్ర విద్యాశాఖ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. తరగతులు, కాంప్లెక్స్, మండలం, జిల్లా, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా హాజరు శాతం ఎంత నమోదు అయిందనే సమాచారాన్ని యాప్‌లో చూసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టీచర్లకు ఈ విధానం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టగా.. ఇక నుంచి జిల్లాల వారీగా ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో విద్యార్థుల హాజరు పక్కనే టీచర్ల వివరాలు సైతం నమోదు చేయనున్నారు.
పెరగనున్న పర్యవేక్షణ
ప్రభుత్వ ఉపాధ్యాయులకు మొబైల్ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నిర్ణయం శుభ పరిణామం. గతంలో ఈ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ భావించి నప్పటికీ, పలు సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. ఇదిలా ఉండగా.. స ర్కారు బడుల టీచర్లతో పాటు ఇకముందు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు ఈవిధానం ద్వారా స్కూల్ సమయానికి టీచర్లు చేరుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మరింత పారదర్శకత ఉండేందుకు దోహదపడుతుంది.
హాజరు ఇలా..
ఉపాధ్యాయులు తమ స్మార్ట్‌ఫోన్లలో ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకుంటారు. చేతి రాత ద్వారా సంతకం చేసే రోజుల నుంచి డిజిటల్ రూపంలో హాజరు గుర్తింపు జరుగుతుంది. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా అటెండెన్స్‌తో ఉపాధ్యాయులు సకాలంలో స్కూల్‌కు హాజరు కావడంతో విద్యాబోధనలతో తలెత్తే ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు. రోజులో ఒక పూట గైర్హాజరైనప్పటికీ, 100 శాతం అటెండెన్స్ వేసుకునే పరిస్థితులు ఇక నుంచి ఉండవు. ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ సిస్టంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా, ఎప్పటికప్పుడు పర్యక్షించాల్సిన పూర్తి బాధ్యత పాఠశాల విద్యాశాఖపైనే ఉంది.
ఉపాధ్యాయులు 2,480
మంది
కేజీబీవీలు12
మోడల్ స్కూళ్లు
8
ప్రభుత్వ
పాఠశాలలు
341
జిల్లాలో ఇలా..
నేటి నుంచి ఉపాధ్యాయులకు ఫేషియల్ అటెండెన్స్
పాఠశాల విద్యాశాఖ యాప్‌లో వివరాలు
బడికి వచ్చాక.. వెళ్లిపోయే సమయంలో నమోదు
ఇకపై ఉపాధ్యాయుల సమయపాలనలో
పారదర్శకత
పారదర్శకత పెరుగుతుంది..
పాఠశాలల్లో విద్యార్థులకు మాదిరిగా టీచర్లకు సైతం ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు శాతం అమలు చేయడం మంచి పరిణామం. దీంతో మరింత పారదర్శకత పెరుగుతు ంది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పాఠశాల విద్యాశాఖ నిరంతరం పర్య వేక్షించాలి.
– రావుల రామ్మోహన్‌రెడ్డి,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
జిల్లాలో నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో టీచర్లకు ఫేస్ రికగ్నైజేషన్ ఆధారిత హాజరు అమలు కానుంది. అయితే ముందుగా వారం రోజుల పాటు టీచర్లు ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకుంటారు. వందశాతం యాప్‌లో వివరాలను నమోదు చేసిన వెంటనే ఎఫ్‌ఆర్‌ఎస్ అమల్లోకి వస్తుంది.
– భోజన్న, డీఈఓ, జనగామ

ముఖ చిత్రమే ముఖ్యమిక!

ముఖ చిత్రమే ముఖ్యమిక!

ముఖ చిత్రమే ముఖ్యమిక!

ముఖ చిత్రమే ముఖ్యమిక!

ముఖ చిత్రమే ముఖ్యమిక!