
స్టాక్ రిజిస్టర్లు తప్పనిసరిగా ఉండాలి
చిల్పూరు: ఎరువుల దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు తప్పనిసరిగా ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్‌బాషా అన్నారు. చిన్నపెండ్యాల గ్రామంలోని బీకేఎస్ అగ్రిమాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎరువుల ఔట్‌లెట్‌ను బుధవారం కలెక్టర్ సందర్శించారు. షాపులోని స్టాక్, ధరల బోర్డును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా లెసెన్సులు రద్దు చేస్తామన్నారు. అంతకుముందు చిన్నపెండ్యాలలోని పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ పీహెచ్‌సీని సందర్శించి, వర్షాకాలం ముగిసే వరకు వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకే రోజు ఐదుగురు సిబ్బందికి సెలవులు మంజూరు చేసిన వైద్యాధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే మల్కాపూర్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజవరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, డాక్టర్ కుశాలి, వ్యవసాయాధికారి నజీరుద్దీన్, న ర్సింహులు, వినయ్‌కుమార్, దాసరి గోవర్దన్, అధి కారులు తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ రిజ్వాన్‌బాషా