జనగామ: తెలంగాణ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ సబ్ జూనియర్ అండర్–15 పోటీల్లో జిల్లా నుంచి వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన వారిని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం అభినందించారు. పోటీల్లో పతకాలు సాధించిన గూడురులోని తెలంగాణ గిరిజన బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు కె.ఐశ్వర్య, జి.సాత్విక, బి.అనూష, జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి.మనోజ్, ఈ.శశికాంత్‌రెడ్డిలను కలెక్టర్ రిజ్వాన్ బాషా శాలువా, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటరెడ్డి, కోచ్ రాజు, పీఈటీ సుష్మిత పాల్గొన్నారు.
ఇత్తడి కవచాల అందజేత
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలోని అమ్మవార్లకు, గరుడస్వామికి రూ.60వేల విలువైన ఇత్తడి కవచాలను బుధవారం అందించారు. హైదరాబాద్‌కు చెందిన పొతకనూరి సతీష్‌కుమార్–పుష్పలత, అక్షయతన్వి, వెంకట్‌అద్విక్‌లు ఉదయం ఆలయానికి చేరుకుని ఇత్తడి కవచాలకు ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులచే ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావుల సమక్షంలో అందించారు.
దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు
జనగామ రూరల్: దేశంలో పేదలు ఉపాధి లేక అల్లాడుతున్నారని, నిరుద్యోగంతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు అన్నారు. బుధవారం మండలంలోని మరిగడిలో మండల కార్యదర్శి బోడ నరేందర్ అధ్యక్షతన రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టబడిదారి విధానాలకు ప్రత్యామ్నాయం సోషలి స్టు విధానాలేనన్నారు. రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. కమిటీ సభ్యులు పోతుకునూరి ఉపేందర్, చందునాయక్, రాములు, ఆనందం, రామచొక్కం, సాంబరాజు పాల్గొన్నారు.
సాగునీరు అందించాలని నిరసన
స్టేషన్‌ఘన్‌పూర్: దేవాదుల ద్వారా పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో 3ఎల్ సబ్ కెనాల్ వద్ద రైతులు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు గొడిశాల సతీష్, జూలుకుంట్ల ప్రకాష్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘన్‌పూర్ మెయిన్ కెనాల్ నుంచి ఇటీవల నీటిని విడుదల చేసిన సమయంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని తెలిపారని, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఇప్పగూడెం 3ఎల్ సబ్ కెనాల్‌లోకి నీరు రావడం లేదన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే, అధికారులు స్పందించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాటికొండ వెంకటయ్య, మల్లారెడ్డి, బాబు, రవి, చంద్రమౌళి పాల్గొన్నారు.
జీపీ సిబ్బందికి ప్రతీనెల వేతనాలు
బచ్చన్నపేట: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల సిబ్బందికి ప్రతీనెల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి అన్నారు. బుధవారం మండలంలోని పోచన్నపేట గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఇటీవల జీపీ సిబ్బందికి వేతనాలు అందడం లేదనే ఫిర్యాదు మే రకు విచారణ చేపట్టారు. జీపీల్లో పనిచేసే సి బ్బందికి వేతనాలు అందించేలా ఆదేశాలు ఇ చ్చామన్నారు. అనంతరం పలు జీపీ రికార్డుల ను పరిశీలించారు. ఎంపీడీఓ వెంకటమల్లికా ర్జున్, కార్యదర్శి వెంకట్, సిబ్బంది ఉన్నారు.
విజేతలకు సన్మానం
విజేతలకు సన్మానం
విజేతలకు సన్మానం