
పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
జనగామ రూరల్: పాలసేకరణలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని, పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్‌సింగ్ అన్నారు. పట్టణంలోని విజయడెయిరీ చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి అధ్యక్షతన బుధవారం పాల ఉత్పత్తి సహకార సంఘాల అధ్యక్షులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ రైతులకు దాణా, గడ్డి విత్తనాలు, కాల్షియం తదితర సబ్సిడీపై అందజేస్తామన్నారు. పాల సంఘాలకు అవసరమైన పాల క్యాన్లు, బిల్లులు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దామెర నాగరాజు, మేనేజర్లు డాక్టర్ నరేష్, హరికృష్ణ, లింగారెడ్డి, లక్ష్మి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డైరెక్టర్ గోపాల్‌సింగ్
పాలసేకరణలో జిల్లా టాప్