రాయికల్: రాయికల్ బల్దియా కార్యాలయంలో నీటికొరత తీవ్రమైంది. తాగునీటికోసం కార్యాలయం సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజూ ట్యాంకర్ ద్వారా కార్యాలయంలోని సంప్‌ను నింపి.. అవసరాలకు వాడుకుంటున్నారు. కమిషనర్ మనోహర్‌గౌడ్ స్పందించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని ఉద్యోగులు, సిబ్బంది కోరుతున్నారు.
వసతుల కోసం మెడ్‌కోల ఆందోళన
జగిత్యాల: వైద్య కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మెడికోలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, హాస్టల్ అందుబాటులోకి తేవాలని కోరారు. జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు ఇద్దరు వైద్యులే అని, సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఎంసీహెచ్‌లో ఆందోళనకు సిద్ధం కాగా.. అనుమతి ఇవ్వకపోవడంతో ర్యాలీ చేపట్టారు.
మెడిసిన్ విద్యార్థినికి మరో రూ.25వేల సాయం
రాయికల్: మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన మెడిసిన్ విద్యార్థిని కనికారపు అంజలి కి బీజేపీ ఎస్‌ఐఆర్ జిల్లా కన్వీనర్ పుప్పాల శ్రీనివాస్ రూ.25వేల ఆర్థిక సహాయం అందించారు. గతనెల 23న ‘సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువు..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన శ్రీనివాస్.. జిల్లాకేంద్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అంజలికి రూ.25వేలు అందించారు. ఆమె పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నా యకులు ప్రశాంత్, ఆకుల మహేశ్, ఏనుగు ముత్యంరెడ్డి, జుంబర్తి దివాకర్, మండల ప్రధా న కార్యదర్శి వట్టిమల్ల శ్రీనివా్‌స్ పాల్గొన్నారు.
ఉద్యోగాలకు 21 మంది జేఎన్టీయూ విద్యార్థులు
కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో బుధవారం నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 21 మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఎక్స్‌ఎల్‌ఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 6, 7తేదీల్లో సంస్థ హెచ్‌ఆర్ అవినాష్ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. సీఎస్సీ, ఐటి విభాగాలకు చెందిన 17 మంది, ఎంటెక్ చేస్తున్న నలుగురు ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ఏటా రూ.3.5లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను ప్లేస్‌మెంట్ అధికారి సతీష్, అధ్యాపకులు అభినందించారు.
సైబర్ నేరాలపై అవగాహన
జగిత్యాలక్రైం: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నా రు. సైబర్ జాగృక్త దివాస్ కార్యక్రమంలో భా గంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పే ర్కొన్నారు. డిజిల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలపై అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సదస్సులు నిర్వహిస్తామన్నారు. అనుమానాస్పదకాల్, సందేశం, లింక్, ఆన్‌లైన్ ఆఫర్ వచ్చినప్పుడు నిజాలు ధ్రువీకరించుకున్న తర్వాతే ముందుకెళ్లాలన్నా రు. తెలియని వ్యక్తులు పంపే లింక్‌లను క్లిక్ చే యవద్దని, ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్‌వర్డ్ వంటివి ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే ఆలస్యం చే యకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.


