కనుల పండువగా శోభాయాత్ర | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా శోభాయాత్ర

Oct 22 2026 12:27 AM | Updated on Oct 22 2026 12:27 AM

ధర్మపురి: ధర్మపురిలో దసరా ఉత్సవాలను మంగళవారం సాయంత్రం మహా వైభవంగా జరిపారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం ఉత్సవ మూర్తులైన యోగా, ఉగ్ర, వేంకటేశ్వర స్వాములను ఆలయం నుంచి జంబి గద్దె వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఆయుధ పూజతోపాటు స్వాములకు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గాల్లోకి కాల్పులు

ధర్మపురి పట్టణంలో ప్రతీ సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న దసరా పర్వదినం రోజున జంబి గద్దె వద్ద పూజలు జరిపి అనంతరం గాలిలో కాల్పులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. సీఐ రాంనర్సింహరెడ్డి ఎస్సై సదాకర్‌ గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. స్వాములను జయజయ ధ్వానాల మధ్య శోభాయాత్రగా తీసుకెళ్లారు. దారి పొడవునా వేలాది మంది భక్తులు తరలివచ్చి శోభాయాత్రను తిలకించారు. ధర్మపురి పట్టణంలో దసరా వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, డీఎస్పీ రఘుచందర్‌, దేవస్థానం చైర్మన్‌ జక్కు రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement