న్యూస్‌రీల్
జగిత్యాలటౌన్: జంబి గద్దె వద్ద మహిషాసురమర్దిని కార్యక్రమం
జగిత్యాలటౌన్: బొద్దింకలతో ఉన్న మహిషాసురుని బొమ్మ
రాయికల్‌లో మహిషాసురుని దహనం
ఉత్సాహంగా విజయదశమి
విజయదశమి సందర్భంగా మంగళవారం జగిత్యాల, రాయికల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని చారిత్రక జంబి గద్దె వద్ద ఏర్పాటు చేసిన శమీపూజలో బల్దియా చైర్మన్ సమిండ్ల వాణి దంపతులతోపాటు కమిషనర్ సత్యప్రణవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల ముగింపు సందర్భంగా అమ్మవార్లను జంబి గద్దె మీదుగా ఊరేగింపు జరిపి నిమజ్జనం చేశారు. బొద్దింకలతో కూడిన మహిషాసురుడి బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాయికల్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద నిర్వహించిన వేడుకలకు వేలాది మంది జనం హాజరు కాగా.. సంఘమిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని అలంకరించి మహిషాసురుని దహనం చేయించారు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
– జగిత్యాలటౌన్/రాయికల్
రాయికల్‌లో ఒకే కుటుంబానికి చెందిన వైద్యులు
రాయికల్‌లో మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, ఎస్సై సుధీర్‌రావు
రాయికల్‌లో దసరా వేడుకలకు హాజరైన అశేష జనవాహిని


