సద్దుల బతుకమ్మ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

సద్దుల బతుకమ్మ వేడుకలు

Oct 22 2026 12:27 AM | Updated on Oct 22 2026 12:27 AM

సంగెంలో..

కోరుట్ల రూరల్‌: సంగెం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. సంఘమహేశ్వర ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని సర్పంచ్‌ చీటి స్వరూప–వెంకట్రావ్‌ ఆవిష్కరించారు. సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

రాయికల్‌: రాయికల్‌ మండలం ఇటిక్యాల, తాట్లావాయితోపాటు పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలను సేకరించి గౌరిదేవిని ప్రతిష్ఠించి బతుకమ్మ ఆడారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. సర్పంచులు నీరటి శ్రీనివాస్‌, మల్లేశం, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement